*అమరావతిలో ‘ఆవకాయ్’ ఉత్సవాలు*
అమరావతి: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో అమరావతిలో ‘ఆవకాయ్’ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. జనవరి 8 నుంచి 10 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు సినిమా సాహిత్యం, కవిత్వం, సంగీతం, నృత్య విభాగాల్లో ఈ వేడుకలు ఉండనున్నాయి. కృష్ణానదీ తీరం పున్నమి ఘాట్, భవానీ ద్వీపంలో వీటికోసం ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల పోస్టర్‌ను మంత్రి కందుల ఆవిష్కరించారు.